పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం

20 Jan, 2019 20:09 IST|Sakshi

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఏపీలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. వారికి ఎవరైనా అడ్డుచెప్పినా, ఎదురుతిరిగినా, ప్రశ్నించినా దాడికి దిగటం టీడీపీ నాయకులకు సర్వసాధారణంగా మారింది. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏకంగా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఏలూరు టౌన్‌ హాల్‌లో లక్షల రూపాయల్లో జూదం ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. దీంతో చిర్రెత్తుకుపోయిన బడేటి బాబ్జి హాల్‌​ వద్దకు చేరుకుని పోలీసులపై విరుచకుపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే తీరుతో ఒక్కసారిగా విస్తుతపోయిన పోలీసుల సర్దిచెప్పె ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే వినలేదు. అయితే గత ఏడాది రెండు సార్లు దాడి చేశామని, లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు