మహిళను చెప్పుతో కొట్టమన్న టీడీపీ ఎమ్మెల్యే!

18 Jan, 2019 17:06 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బరితెగించారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఓ మహిళా రైతును చెప్పుతో కొట్టాలని తన అనుచరులను ఆదేశించారు. మహిళపై దాడిచేసిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని పోలీసులుకు సురీ హుకుం జారీ చేశారు. ఈ వ్యవహారమంతా పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే జరిగినా వారునోరు మెదపక పోవటం​ గమనార్హం.

ఇకపై భూసేకరణను ఎవరు ఎదిరించినా వారిపై దాడులు చేయాలని అతని అనుచరులను సురీ అదేశించారు. శుక్రవారం జరిగిన ఘటనకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా ఎమ్మెల్యే తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓట్లేసి గెలిపించిన తమని ఇలా చెప్పులతో దాడి చేయిస్తారా అని నిలదీస్తున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా