టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ హల్‌చల్‌

17 Mar, 2017 10:34 IST|Sakshi
టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ హల్‌చల్‌

కడప : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ శుక్రవారం జమ్మలమడుగులో హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు. మరోవైపు రాజంపేటలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఓటుహక్కు లేని టీడీపీ నేతలను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించారు. దీనిపై ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు కానీ పోలీసులు పట్టించుకోలేదు.

కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.  స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గేందుకు అందినకాడికి ప్రలోభాలకు గురిచేస్తూ... లొంగిని వారిపై దౌర్జన్యాలకు అధికార పార్టీ తెరతీసింది. మరోవైపు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను గాలికి వదిలేసి పలువురు మంత్రులు గత వారంగా జిల్లాల్లో తిష్ట వేసి, చక్రం తిప్పుతున్నారు. బలం లేని చోటుకూడా బలవంతంగా నెగ్గేలా కుతంత్రాలు చేస్తోంది. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిబిరాలు పెట్టించి మరీ టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు.