వీడియో దుమారం: టీడీపీ ఎంపీల వివరణ

29 Jun, 2018 14:03 IST|Sakshi
టీడీపీ ఎంపీలు(ఫైల్‌ ఫోటో)

సాక్షి, ఏలూరు: హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షల వ్యవహారం బయటపడటంతో టీడీపీ ఎంపీలు నష్టనివారణ చర్యలకు దిగారు. తమ సంభాషణల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్‌ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు.

తమ మాటలను మార్ఫింగ్‌ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పన్నిన కుట్రగా ఎంపీలు పేర్కొన్నారు. 

చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు కితాబిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు మార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మురళీమోహన్‌, మాగంటి బాబు, గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.    

 

చదవండి: బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబువి చౌకబారు విమర్శలు

ధనిక రాష్ట్రంలో జీతాలకు కోతలా?

ఉత్తరాలు, ట్వీట్లు మానుకొని ముందుకు రండి

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా

సిగ్గు అనిపించడం లేదా చంద్రబాబు?

సినిమా

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!