కలెక్టరే నేను చెప్పింది చేస్తాడు..

23 Nov, 2017 11:02 IST|Sakshi
ఆక్రమణకు గురైన భూమి ,రమాదేవి,ఎస్సీకాలనీ

నీకు దిక్కున్న చోట చెప్పుకో..

అధికారపార్టీ సర్పంచ్‌ హంగామా

దళిత మహిళ ఆవేదన

సంబేపల్లె : మండలకేంద్రంలోని ఎస్సీకాలనీకి  చెందిన దళిత మహిళ రమాదేవి భూమిలో అక్రమంగా  రోడ్డు వేస్తున్న అధికారపార్టీ సర్పంచ్‌ నేను ఏమి చెపితే  కలెక్టర్‌   అలాగే చేస్తాడు అంటూ అధికార దర్పం చూపిస్తున్నాడని  దళిత మహిళ వాపోతోంది. బుధవారం ఇక్కడ  ఆమె మాట్లాడుతూ నా భూమి ఆక్రమించొద్దని  ప్రాధేయపడినా స్థానిక సర్పంచ్‌  నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ దుర్భాషలాడుతున్నారని వాపోయారు. భూమి ఆన్‌లైన్‌కోసం తహసీల్దారు కార్యాలయ చుట్టూ తిరిగినా రెవెన్యూఅధికారులు  స్పందించలేదన్నారు. గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడైన సర్పంచే ఎస్సీ భూములు కాజేసేందుకు కంకణం కట్టుకుంటే మాకు న్యాయం ఎలా జరుగుతుందని అంటున్నారు. అధికారులు స్పందించి భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం   ఉంది.

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
తన భూమి ఆక్రమణకు గురవుతోందని  పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశా. న్యాయం జరగక పోవడంతో ఈ నెల 21న ప్రజావాణి ద్వారా కలెక్టర్‌కు  తెలియజేశానా వినతిని స్వీకరించి వారు ఇచ్చిన రసీదును బుధవారం  తహసీల్దారు చంద్రమ్మకు అందజేయబోగా ఆమె తిరస్కరించింది. నిన్ను కలెక్టర్‌ దగ్గరకు ఎవరు వెళ్లమన్నారని, నీసమస్యను కలోక్టర్‌ దగ్గరే పరిష్కరించుకో అన్నారు.
– రమాదేవి,ఎస్సీకాలనీ

మరిన్ని వార్తలు