హత్యా రాజకీయూలు మానుకోవాలి

24 Aug, 2014 01:36 IST|Sakshi
హత్యా రాజకీయూలు మానుకోవాలి

 సాలూరు : టీడీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, సాలూ రు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం ఆ యన అసెంబ్లీ సమావేశాల నుంచి ఫోన్‌లో ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే ఆయనపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేనిపోని ఆరోపణలకు దిగడం విచారకరమన్నారు. సభలో స్పీకర్ అనుసరిస్తున్న తీరు కూడా సరిగ్గా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వంద రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో హత్యా రాజకీయాలను కూడా చేర్చినట్టుందని ఎద్దే వా చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.  
 
 గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
 టీడీపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోం దని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. గిరిజను లు అధికంగా నివశిస్తున్న గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా ఈ డిమాండ్ ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి ంచుకోవడం లేదన్నారు. జిల్లాలో 460 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా చేర్చాల్సి ఉందని 2012లో అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండాపోయిం దన్నారు. అలా చేయకపోవడం వల్ల గిరిజనులు రాజ్యాంగపరమైన హక్కులు కోల్పోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టంతో పాటు, పీసా చట్టం అమలుకు నోచుకోవడం లేదన్నారు.
 
 షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించడం వల్ల ఆయా గ్రామాల పరిధిలోని ఉద్యోగాలు వంద శాతం గిరిజనులకే దక్కుతాయని చెప్పారు. ప్రభుత్వపరంగా ఇస్తున్న అనేక రాయితీలు, రిజర్వేషన్ల ఫలాలు గిరిజనుల దరి చేరుతాయన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని తనతో పాటు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డిమాండ్ చేసినట్టు తెలిపారు. గిరిజనులకు ఏదైనా మేలు జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి, ఎన్‌టీఆర్ హయూంలోనే జరిగిందని గుర్తు చేశారు. అలాగే పదో తరగతి పాసై ఇంటర్‌లో సీట్లు రాక మధ్యలో చదువు మానేస్తున్న గిరిజన విద్యార్థులపై ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. జిల్లాకు ఐదు గిరి జన గురకుల జూనియర్ కళాశాలలు మంజూరు చేయాల్సిన అవసరం వుందన్నారు. వీటిని తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు