ఓటు కోసం

15 Nov, 2013 05:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రధానంగా టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఎన్నికల దిశ గా సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, రాజకీయంగా అడ్డంకులను అధిగమించేలా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో రానున్న ఎన్నికల్లో ఒం టరిగా పోటీ చేయాలా, కాంగ్రెస్‌లో విలీనమా అన్న చర్చ సాగుతుండగా, తెలుగుదేశంలో మాత్రం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి ఆందోళన కలి గిస్తోంది. రాష్ట్ర విభజనపై రెండు కళ్ల సిద్ధాం తం, సమన్యాయం డిమాండ్‌తోపాటు జీవోఎంతో చర్చించేందుకు ఢిల్లీ సమావేశానికి పార్టీ తరపున ప్రతినిధులను పంపించకపోవడంతో జిల్లా పార్టీలో అయోమయం నెలకొంది. జీవోఎంతో సమావేశం కాకపోవడం తెలంగాణకు పార్టీ వ్యతిరేకమని సంకేతాలను ఇచ్చినట్లు అ య్యిందని  నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
 
 శిక్షణపై టీఆర్‌ఎస్ కసరత్తు
 తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించడంతో పార్టీ నేతలలో ఆందోళన పెరిగింది. పార్టీ శ్రేణుల నుం చి ఒత్తిడి పెరగడంతో ఎన్నికలలో ఒంటరి గానే పోటీచేస్తామని కేసీఆర్ ఆ తరువాత సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ పార్టీ భవిష్యత్తుపై రెండు విధాలుగా మాట్లాడుతున్న తీరు జిల్లా నాయకులతోపాటు కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. మరోవైపు మండల స్థాయి శిక్షణ శిబిరాలకు సమాయత్తం కావాలని అధిష్టానవర్గం ఇచ్చిన పిలుపునకు జిల్లా నాయకత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 16 నుంచి డిసెంబర్ 10 వరకు 36 మండలాలలో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. శిక్షణ శిబిరాలకు 400 మంది నుంచి 500 మంది వర కు గ్రామ స్థాయి పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు హాజరయ్యేలా కృషి చేస్తున్నారు.
 
 శిక్షణ ఈ అంశాలపైనే
 ఈ శిక్షణలో ‘తెలంగాణ చరిత్ర-వివక్ష’  ‘తెలంగాణ ఉద్యమం-టీఆర్‌ఎస్ పాత్ర’  ‘తెలంగాణ ఏర్పాటు-పునర్నిర్మాణంలో పార్టీ పాత్ర’ ‘హైదరాబాద్ షహర్ హమా రా’ అనే అంశాలపై ఒక రోజంతా కార్యకర్తలకు వివరించనున్నారు. ఉపన్యాసకులుగా 60 మంది నాయకులను సిద్ధం చేయగా, ఇందులో జిల్లా శిక్షణ కార్యక్రమంలో 30 మందికి పైగా ఉపన్యాసకులు పాల్గొననున్నారు. పార్టీ అధినేత  కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీష్‌రావు, కడియం శ్రీహరి, జోగురామన్నతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్ శిక్షణలో భాగస్వామ్యాన్ని పంచుకుం టారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లా సమన్వయకర్తగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అధినాయకత్వం అప్పగించింది.
 
 అనంతరం అధినేతకు నివేదిక
 శిక్షణ కార్యక్రమాలు పూర్తై తరువాత సుధాకర్‌రెడ్డి కేసీఆర్‌కు నివేదికను సమర్పిస్తారు. ఈ నివేదికతో నియోజకవర్గాల వారీగా నాయకత్వ పనితీరు తెటతెల్లం కానుంది. ఈనెల 16న సిరి కొండ, 17న డిచ్‌పల్లి, 18న వర్ని, 19న నం దిపేట, 20న బాన్సువాడ, 22న బీర్కూరు, మాచారెడ్డి, 23న కోటగిరి, సదాశివనగర్, 24న కమ్మర్‌పల్లి, ధర్పల్లి, 25న రెంజల్, భీంగల్, 26న నవీపేట, ఎల్లారెడ్డి, 27న భిక్కనూరు,ఆర్మూర్, 28న ఎడపల్లి, నిజామాబాద్ మండలాలలో శిక్షణ శిబిరాలు ఉంటాయి. మిగితా  మండలాల షెడ్యూల్‌ను తరువాత ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
 దేశంలో తర్జనభర్జనలు
 రాష్ట్ర విభజన ప్రక్రియపై జీవోఎం నిర్వహిం చిన సమావేశానికి టీడీపీ పక్షాన ప్రతినిధులు హాజరుకాకపోవడంపై జిల్లా నాయకత్వం సహా కేడర్‌లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అధినేత చంద్రబాబు తీరుతో తెలంగాణ ప్రజ లు టీడీపీని నమ్మడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు టీడీపీ అనుకూలమని మొత్తుకున్నా..ఇక్కడి ప్రజలు వినే పరిస్థితి లేదని అంటున్నారు. ఈనెల 16న టీడీపీ అధిష్టానం రైతు సమస్యలపై ధర్నా నిర్వహించాలని ఇచ్చిన పిలుపుపై స్పందిం చే విషయంలో అచితూచీ అడుగులు వేయాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. అదే విధంగా ఈనెల చివరి వారంలో ‘ఇంటింటికి దేశం’ కార్యక్రమం తో ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ సూచనలపై కూడా జిల్లా నాయకులు సందేహ పడుతున్నా రు. దీనికంటే ముందు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించాలని జిల్లా నాయకత్వం యోచిస్తోంది.  కార్యకర్తల అభిప్రాయం మేరకే అధిష్టానవర్గం ఇచ్చిన పిలుపులపై స్పం దించాలని భావిస్తున్నారు. వారి అభిప్రాయాలు అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే రాజ కీయ భవిష్యత్తును వెత్తుకునే మార్గాన్ని ఆలోచించాలనే యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు