-

టీడీపీ భూస్థాపితం ఖాయం

15 Apr, 2014 02:27 IST|Sakshi

పలమనేరు, న్యూస్‌లైన్: మాజీ మంత్రి పట్నం సుబ్బ య్య తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో  కొండంత బలం వచ్చిందని పలువు రు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద సోమవారం సుబ్బయ్యకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు అసెంబ్లీ అభ్యర్థి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ సుబ్బయ్య లాంటి సీనియర్ నాయకులు తమ పార్టీలోకి రావడం చాలా సంతోషకరమన్నారు.

ఆయన రాకతో పార్టీకి మరింత బలం పెరిగిం దన్నారు. ఇదే సమయంలో పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు దళిత నేతలంతా ఏకతాటిపైకి రావడం, ముస్లిం మైనారిటీలు అండగా నిలవడం, బడుగు బలహీన వర్గాలు తమ పార్టీని అక్కున చేర్చుకోవడం పార్టీకి ఎంతగానో మేలు చేస్తుందన్నారు.  చంద్రబాబు కుమ్మక్కు, కుట్ర లు నచ్చక   ఎంతోమంది సీనియర్లు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు.

ఇప్పటిదాకా టీడీపీ ఈ ప్రాం తంలో సజీవంగా ఉందంటే దానికి కారణం సుబ్బయ్య కృషేనన్నారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడం తన కు ఎంతగానో మేలు చేకూరుస్తుందన్నారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ సుబ్బయ్య రాకతో పలమనేరు అసెంబ్లీ ఎన్నికల్లో అమరనాథరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నా రు. టీడీపీ డబ్బున్న వారితో నిండిపోయిందని విమర్శించారు.

వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడు తూ వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలు జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అందు కే ప్రజల మద్దతు వైఎస్‌ఆర్‌సీపీకి ఉందన్నారు. సుబ్బ య్య పార్టీలోకి రావడం తమకందరికీ సంతోషాన్ని కలిగించిందన్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం వైఎస్‌ఆర్ సీపీతోనే సాధ్యమన్నారు.అనంతరం మాజీమంత్రి సుబ్బయ్య మాట్లాడారు.

ఇంతమంది మిత్రుల మధ్య తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా ఆనందించదగ్గ విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని  ఆయన  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ.కుమార్, ఖాజా, రవీంద్ర,  శ్యామ్, మూర్తి, కమాల్, ఖాజా, ఎలి జర్,మోహన్ రెడ్డి,  ఏకే.మూర్తి, కిషోర్, షబ్బీర్, కిరణ్,  తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు