టీడీపీ మహిళా నేత దందా 

31 Aug, 2019 10:01 IST|Sakshi
పోలీసులు అదుపులోకి తీసుకున్న కంకర టిప్పర్‌

సీజ్‌ చేసిన క్వారీ నుంచి కంకర అక్రమ రవాణా

టిప్పర్‌ను పట్టుకున్న పోలీసులు 

సాక్షి, పెనుకొండ: టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్‌ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. క్వారీలోని కంకరను బయటకు తరలించకుండా ఆదేశాలు జారీ చేశారు.

అయితే నిబంధనలను ఉల్లంఘించి క్వారీ నిర్వాహకులు గత రెండు రోజులుగా 6 ఎంఎం కంకరను టిప్పర్‌లో బయటకు తరలిస్తున్నారు. నిఘా ఉంచిన కియా పోలీసులు టిప్పర్‌లో అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టిప్పర్‌ సహా డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు. ఇదిలా ఉంటే టిప్పర్‌పై దేవా వెంకటకొండయ్య పేరు ఉంది. ఇతను సవితమ్మ భర్త వెంకటేశ్వరరావుకు స్వయానా తమ్ముడు. ఇతను చనిపోయాడు. కంకరను సవితమ్మే అక్రమంగా తరలిస్తుందనేందుకు ఇదే నిదర్శనంగా పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జరగని విందుకు.. మేము ఎలా వెళ్తాం?

‘ఉదయం 11 తర్వాత బయటకు రావొద్దు’

ప్రకాశం జిల్లాలో ప్రమాద ఘంటికలు

సమస్యలుంటే 104కి కాల్ చేయండి: జవహర్‌రెడ్డి

వారికి విసుగొస్తే కరోనా అందరికి సోకుతుంది: రోజా

సినిమా

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...