టీచర్లకే చదువు రాకుంటే పిల్లలకేం చెబుతారు..

9 Jan, 2014 03:30 IST|Sakshi
టీచర్లకే చదువు రాకుంటే పిల్లలకేం చెబుతారు..

తాంసి(తలమడుగు), న్యూస్‌లైన్: బోధించే మీకే తెలియకపోతే విద్యార్థుల కు ఏం చదువు చెబుతారంటూ తాంసి మండ లం పొన్నారి గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల ఉ పాధ్యాయుడు ఆశన్నపై కలెక్టర్ అహ్మద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రపంచ పటంలో బ్రెజిల్ ఎక్కడుందో చూపించం డి.. అంటూ పదో తరగతి విద్యార్థులను ప్రశ్నిం చగా సరైన సమాధానం రాలేదు. సాంఘిక శా స్త్రం బోధించే ఉపాధ్యాయుడు ఆశన్న కూడా చూపించలేదు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ టీచర్ల కే చదువు రాకుంటే పిల్లలకేం చెబుతారని అ న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు చదువుతూ హాజరుపట్టికను పరిశీలించారు. పదో త రగతి గదిలోకి వెళ్లి సిలబస్ ఎక్కడి వరకు పూర్తయిందంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అ డిగి తెలుసుకున్నారు.
 
 సాంఘికశాస్త్రం, గణితం సిలబస్ పూర్తికాలేదని చెప్పడంతో డిసెంబర్‌లో గా పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ పూర్తికాకపోవడం ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం ప డుతోందని అన్నారు. ఇంగ్లిషు, గణితం విద్యార్థులను పిలిచి బోర్డుపై లెక్కలు, ఇంగ్లిషు రా యించారు. వేసిన ప్రశ్నలకు ఏ ఒక్కరూ సరైన సమాధానం రాయకపోవడంతో ఇక్కడ పాఠశా ల నిర్వహించడం ఎందుకు, చదువు చెప్పే వారి వద్దకు విద్యార్థులను పంపిస్తే సరిపోతుందని, ఉపాధ్యాయులు ఉండడం ఎందుకు అంటూ అ సహనం వ్యక్తం చేశారు. గోడలపై వేసిన సైన్స్ చిత్రపటాలను విద్యార్థులతో చదివించారు. వా టి అర్థం ఏమిటని ప్రశ్నించగా ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేదు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు చిన్న చిన్న కూడిక లు, ఇంగ్లిషు పదాలు కూడా రాకపోతే పబ్లిక్ ప రీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు.
 
 కాపీయింగ్ జరుగుతుందని అనుకుంటున్నారేమో.. అలాం టిదేమీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఉత్తీర్ణత శాతం ఐదు శాతం వచ్చినా పరవాలేద ని, కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయురాలు సు లోచనను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ప రిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా వండడంపై ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లపప్పు, దొడ్డన్నం, రుచిలేని వంటలు చూసి నిర్వాహకులపైనా మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం పెట్టని వారిని తొలగించాలని అన్నారు.

మరిన్ని వార్తలు