కీచక టీచర్‌: అశ్లీల వీడియోలు చూపిస్తూ

6 Mar, 2020 11:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విద్యాబుద్ధులు బోధించే టీచర్లే పెడదోవ పడుతున్నారు. క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మంచీచెడూ వ్యత్యాసాలు తెలిసిన వాళ్లే తప్పుదారి పడుతున్నారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాల్సిన వారి దగ్గరే పిల్లలకు కనీస రక్షణ కరువైన దుస్థితి ఏర్పడుతోంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెస్తున్న టీచర్ల ఉదంతం రోజుకొకటి వెలుగు చూడటం కలకలం రేపుతోంది. (కీచక హెచ్‌ఎంను చితకబాదిన తల్లిదండ్రులు)

తాజాగా శుక్రవారం అనకాపల్లిలో మరో కీచక టీచర్‌ బయటపడ్డాడు. ఉడ్‌పేట ప్రభుత్వ పాఠశాలలో కృష్ణమూర్తి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన విద్యార్థినులకు సెల్‌ఫోన్లో నీలిచిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో ఓ బాధిత విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నాడన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.(విద్యార్థినులను లైంగికంగా వేధిస్తోన్న హెచ్‌ఎం)

చదవండి: మాస్టారు నీచత్వం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు