సెల్‌ఫోన్‌ తెచ్చిన తంటా 

14 Aug, 2019 08:42 IST|Sakshi
చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలు వైజయంతి

ఉపాధ్యాయురాలి  ఆత్మహత్యాయత్నం 

సాక్షి, బుక్కపట్నం: ప్రధానోపాధ్యాయురాలు మందలించిందని మనస్తాపం చెందిన ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తచెరువులోని బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుమన, ఉపాధ్యాయురాలు వైజయంతికి కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయి. తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వినియోగించకూడదని హెచ్‌ఎం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం తరగతి గదిలో సెల్‌ఫోన్‌ కనిపించడంతో ఎందుకు వినియోగించావంటూ వైజయంతిని హెచ్‌ఎం మందలించింది. తాను తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వినియోగించలేదని, విద్యార్థినులే ఇందుకు సాక్ష్యమని ఉపాధ్యాయురాలు వివరణ ఇచ్చింది.

అయినా హెచ్‌ఎం ఇదేమీ పట్టించుకోకుండా మందలించడంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయురాలు వైజయంతి ల్యాబ్‌లోకి వెళ్లి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో జీతభత్యాల చెల్లింపు విషయంలోనూ హెచ్‌ఎం కావాలానే ఇబ్బందులు కలిగించిందని బాధితురాలు ఆరోపించింది. అనంతరం బాధితురాలు కొత్తచెరువులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం ఘటనపై హెచ్‌ఎంను వివరణ కోరగా తాను పాఠశాలలో పనివేళల్లోనే మాట్లాడుతానని విలేకరులకు తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హెచ్చెల్సీ ఆయకట్టు రైతులను ఆదుకుంటాం

జెండా స్తంభానికి కరెంట్‌; ముగ్గురు చిన్నారుల మృతి..!

పద్ధతి మారకపోతే పంపించేస్తా

కలకలం రేపిన బాలిక కిడ్నాప్‌

ఆరని సందేహాల మంటలు

తీగ లాగితే డొంక కదిలింది

గుహలోకి వెళ్లి తల్లి, కొడుకు మృతి

నందలూరులో రూ.25వేలకే బుల్లెట్‌!

ఆగని అక్రమ రవాణా

విహారంలో విషాదం..

ఆందోళనకరంగా శిశు మరణాలు

చంద్రబాబు ట్రాప్‌లో బీజేపీ

సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు

తొందరెందుకు.. వేచిచూద్దాం!

కొత్తగా లా కాలేజీలకు అనుమతులు లేవు

పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి

‘పోలవరం’లో రివర్స్‌ టెండరింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు

వలంటీర్లే వారధులు!

కడలి వైపు కృష్ణమ్మ పరవళ్లు

నిండుకుండలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ

వారికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది: సీఎం జగన్‌

‘నాలుగు పంపుహౌస్‌ల్లో ఒకటే పనిచేస్తోంది’

‘ఐఐటీ తిరుపతి అభివృద్దికి సహకరించండి’

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి

ఈనాటి ముఖ్యాంశాలు

పెట్టుబడులు ఎక్కడ చంద్రబాబు? : అవంతి

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!