కీచక గురువు సస్పెన్షన్

17 Dec, 2015 23:37 IST|Sakshi
కీచక గురువు సస్పెన్షన్

ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో కృష్ణారెడ్డి
విచారణ చేపట్టిన ఉప విద్యాశాఖాధికారిణి రేణుక

 
నక్కపల్లి : మండలంలో జానకయ్యపేట పాఠశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్న కీచక గురువు ఈశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో కృష్ణారెడ్డి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంపై జిల్లా ఉప విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక గురువారం విచారణ చేపట్టారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈశ్వర్ తనను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పాఠశాలలో తొమ్మి దో తరగతి చదువుతున్న పెదతీనార్లకు చెందిన బాలిక గ్రామపెద్దల దృష్టికి తీసుకురావడంతో సర్పంచ్‌లు ఎరిపల్లి శ్రీను, కొర్లయ్య తదితరులు బుధవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీసిన సంగతి తెలి సిందే. ఈ వ్యవహారం పత్రికల్లో రావడంతో డీవైఈవో స్పందించి విచారణకు వచ్చారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. వివాహితుడైన ఉపాధ్యాయుడు కన్నబిడ్డలా చూడాల్సిన విద్యార్థినితో నీచంగా ప్రవర్తించడం సమంజసం కాదని, చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లితోపాటు ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అందరి వాంగ్మూలాన్ని డీవైఈవో రేణుక నమోదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఇలా ప్రవర్తించడం క్షమించరాని నేరమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించరాదన్నారు. విచారణ నివేదికను ఆమె ఉన్నతాధికారులకు అందజే యడంతో ఉపాధ్యాయుడు ఈశ్వర్‌పై డీఈవో చర్యలు తీసుకున్నారు. విచారణలో మత్య్సకార సంఘ నాయకులు శ్రీను, ముసలయ్య, కొర్లయ్య, బాలిక తల్లి బండమ్మ, హెచ్‌ఎం నూకరాజు పాల్గొన్నారు.

రూ.5.35కోట్లతో అదనపు తరగతి గదులు
నక్కపల్లి : జిల్లాలోని పాఠశాలల్లో వసతి సమస్య తీర్చేందుకు ఆర్‌ఎంఎస్‌ఏ మూడో విడత కింద రూ.5.35 కోట్లతో 151 తరగతి గదులను నిర్మిస్తున్న ట్లు ఉపవిద్యాశాఖాధికారిణి సీవీ రేణుక తెలిపారు. గురువారం ఆమె నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా 311 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయని, వీటిలో 109 పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది కొత్తగా గణపర్తి, డి.ఎర్రవరం, పంచదార్లలో పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు