టీచర్లకు మధ్యాహ్నం బాధ్యతలు వద్దు

30 Aug, 2013 00:41 IST|Sakshi
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన బాధ్యతలు అప్పగించి వారిని బోధనకు దూరం చేయొద్దని రాష్ట్రోపాధ్యాయ (ఎస్టీయూ) సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏవీ సు ధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువా రం ఇబ్రహీంపట్నంలోని ఎస్టీయూ కా ర్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మా ట్లాడారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరి మితమని అన్నారు. వారికి మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలు అప్పగిం చి.. అమలులో ఏ చిన్న లోపం జరిగినా చర్యలు తీసుకోవడం సమంజ సం కాదన్నారు.
 
  తమిళనాడు తరహాలో పాఠశాలలకు అనుబంధంగా వంట నిమిత్తం ప్రత్యేక యంత్రాంగాన్ని శాశ్వత ప్రాతి పదికన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీఓ 154ను సవరించి ఆర్జిత సెలవుల నగదు సౌకర్యాన్ని పం చాయతీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు.
 
 ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని, నైట్‌వాచ్‌మెన్‌ల ను నియమించాలని, ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విధానం లో పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎన్. పరమేశ్, ఇబ్రహీం పట్నం, మం చాల మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. యాదగిరి, పి.లక్ష్మణ్, ఎం.శ్రీనివాస్‌గౌడ్, ఆర్.కుమార్, నాయకులు రెడ్యానాయక్, శేఖర్‌రెడ్డి, రాజమల్లయ్య, యూసుఫ్‌బాబా, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు