గురువులకు.. వందనం

5 Sep, 2014 01:37 IST|Sakshi
గురువులకు.. వందనం

 సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైనది. వృత్తి పట్ల నిబద్ధత, మంచి వ్యక్తిత్వం, సహన శీలత, స్వీయ శిక్షణ, నైతిక విలువల పట్ల క్రమ శిక్షణ, విద్యార్థుల తెలివి తేటల్ని గుర్తించి పదును పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వారే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. అటువంటి వారు విద్యార్థుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాడు. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు నూటి కో కోటికో కనిపిస్తారు. అవార్డుల కోసమో, ఎవరి మెప్పు కోసమో కాకుండా విద్యార్థులను భావి భారత  పౌరులుగా తీర్చిదిద్దాలన్న కాంక్షతో పని చేసే వారు చాలా అరుదు. బొబ్బిలి, పార్వతీపురం, ఎస్. కోట పట్టణాల్లో  పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఇదే బాటలో నడుస్తున్నారు. నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు...నలుగురూ   మెచ్చుకొనే మంచి పనులు చేస్తూ.. సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని సరైన మార్గంలో నడపడంతో మార్గదర్శులుగా నిలుస్తున్నారు.    ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిపై ‘సాక్షి’ కథనం.
 
 బొబ్బిలి: నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు... నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేయడంలోనూ మేం సిద్ధహస్తులమేనని నిరూపిస్తున్నారు బొబ్బిలి పట్టణానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు. పట్టణానికి చెందిన టీచర్లంతా యంగ్ మేన్ హ్యాపీ క్లబ్ ఏర్పాటు చేసి అందరూ  నవ్వు తూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత బొబ్బిలికి చెందిన టీచరు మింది విజయ్‌మోహన్ సీతానగరం మండలం నిడగళ్లులో పని చేస్తున్నా రు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 15 మంది టీచర్లు ఒకటై నేడు నవ్వుల లోకాన్ని సృష్టిస్తున్నారు.
 
 వారే స్వయంగా నాటికలు తయారు చేసుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇప్పటికి దాదాపు 25 వరకూ హాస్య ప్రదర్శనలు ఇచ్చి వారిలో ఉన్న ప్రతిభను బయట ప్రపంచానికి చాటారు. దీనిలో మీసాల గౌరునాయుడు, రెడ్డి బెనర్జీ, బొత్స రత్నకిశోర్, మోజేస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ (డెల్టా)ను కూడా స్థాపించి ఆంగ్లంను నేర్పే విధానంతో పాటు సులభతర బోధనపై దృష్టి సారించారు.
 
 మొక్కల ప్రేమికుడు...
 బాడంగి మండలం వాడాడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎస్‌వీ రమణమూర్తి పర్యావరణ ప్రేమికుడుగా పేరు గడించారు. పర్యావరణాన్ని ప్రేమించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఆయన ప్రజల్లో అవగాహన కల్పించడం, వేలాది మొక్కలను సొంత నిధులతో తెప్పించి పంపిణీ చేసి నాటించడానికి నడుం కట్టుకున్నారు. వీటి కోసం గ్రీన్ బెల్టు సొసైటీని ఏర్పాటు చేసి అందులో మరికొందరు టీచర్లను భాగస్వాము లను చేశారు. దీని వల్ల ఒకవైపు మొక్కలు పెంపకంపై అవగాహన పెంచడంతో పాటు పాఠశాలలు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహ దారులకు ఇరువైపులా మొక్కలు నాటిస్తూ వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికి వేలాది మొక్కలు నాటి వృక్ష ప్రేమికుడిగా మారారు. రమణమూర్తి చేస్తున్న కృషికి బొబ్బిలి రాజులు కూడా తనదైన సహకారాన్ని అందిస్తూ మొక్కలు రవాణాకు సొంత వాహనాలను సమకూరుస్తున్నారు.
 
 కళారాధనలో శ్రీదేవి...
 సీతానగరం మండలం జానుమల్లవలసలో టీచరుగా పని చేస్తున్న చుక్క శ్రీదేవి కళాసేవలో తనదైన ముద్ర వేశారు. కళలను, సంసృ్కతీ, సాంప్ర దాయాలను పెంపొందించడానికి సాయి చంద్రిక ఏకంగా కళా సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి నృత్య, పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు ఏ  ర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర స్థాయి నృత్య, నాటక పోటీలు నిర్వహించి మూడు జిల్లాలో ఉన్న నృత్య కళాకారులు, సాంఘిక కళలను పెంపొందిస్తున్నారు. ఇటీవల పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి వినాయకులను పంపిణీకి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.
 
 ఆయనే నాలో స్ఫూర్తి కలిగించారు
 నేను నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్‌జేసీలో చదువుతున్నప్పుడు పౌరశాస్త్ర విభాగాధిపతి విజయరాఘవాచారి ఉండేవారు. ఆయన పాఠాలు విద్యార్థు లను ఎంతో ప్రభావితం చేసేవి. ముఖ్యంగా నాకు ఆయన ప్రసంగమన్నా..బోధనన్నా ఎంతో ఇష్టం. ఆయన సబ్జెక్టు చెప్పే తీరు అద్భుతం. జీవితా  నికి వెలుగునిచ్చే ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరూ రుణపడాల్సిందే!    
  బి. రామారావు, జాయింట్ కలెక్టర్
 
 ‘ఉపాధ్యాయ’ కుటుంబం
 విజయనగరం అర్బన్: ఆ ఇల్లు ఉపాధ్యాయులకు పుట్టినిళ్లు. ఐదుగురు అన్నదమ్ములు, వాళ్లలోని ఇద్దరు భార్యలు ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడి ఆదర్శంగా నిలిచారు. జిల్లా సరిహద్దుల్లోని విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన రెడ్డిపల్లి సన్యాసిరావు,  ఆది లక్ష్మి దంపతులకు ఐదుగురు కుమారులు. నిరాక్షరాస్యులైన వారు ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో పిల్లందర్నీ ఉపాధ్యాయ కోర్సులు చదివిం చారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరి భార్యలు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు.
 
  పెద్ద కుమారుడు శ్రీనివాసరావు బొబ్బాదిపేట ప్రాథమికోన్నత పాఠశాలలోను, (డీఎస్సీ-1998), త్రినాథరావు డెంకాడ మండలం గొడిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలోను (డీఎస్సీ-1998), ప్రసాదరావు విశాఖ జిల్లా రావికమ తం మండలం కన్నంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో (డీఎస్సీ-2008), అప్పలరాజు విశాఖ జిల్లా భీమిలి ప్రాథమికోన్నత ఫిషర్ మేన్  స్కూల్‌లో (డీఎస్సీ-2008), రమేష్ భోగాపురం మండలం దిబ్బలపాలెం ప్రాథమిక పాఠశాలలోనూ (డీఎస్సీ-2008) పని చేస్తున్నారు. అలాగే త్రినాథరావు భా ర్య బి. సుజాత గంట్యాడ మండలం రామవరం ఉన్నత పాఠశాలలో, అప్పలరాజు భార్య సంతోషికుమారి పద్మనాభం మండలం పొట్నూరు ప్రాథ     మికోన్నత పాఠశాలలోనూ పని చేస్తున్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యతను గుర్తెరిన వీరంతా ఉపాధ్యాయ నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ.. విద్యా సేవ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు