విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

15 Nov, 2018 07:44 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యలు వివరిస్తున్న ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు

విజయనగరం :వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యారంతో పాటు ఉపాధ్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడ్ని, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు స్కూల్‌ అసిస్టెంట్లను నియమించాలి. 300 మంది విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి.ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి.ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరు చేయడంతో పాటు పార్వతీపురాన్ని మరో జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్లను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు.
– సామల సింహాచలం, బి.కిశోర్, ఎస్‌. లలితకుమారి,తదితరులు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు

మరిన్ని వార్తలు