వచ్చే సమావేశాల్లో తెలంగాణకు ఆమోదం: మధుయాష్కీ

16 Jul, 2013 21:21 IST|Sakshi

హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఎంపీ మధుయాష్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసి  గతంలోనే తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామాలతో హైకమాండ్‌ను బెదిరించలేరని ఆయన అన్నారు.

2009 డిసెంబర్ నాటి పరిస్థితులు పునరావృతం కావన్నారు. ధిక్కరిస్తే హైకమాండ్ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. తెలంగాణకు కర్నూలు, అనంతపురం కలపాలా? లేదా అనేది కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. తెలంగాణను అడ్డుకునే బ్రహ్మాస్త్రం సీమాంధ్ర నేతల వద్ద ఉంటే, విరుగుడు తమ వద్ద ఉందని ధీమా వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే చర్యలకు సీమాంధ్రనేతలు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డ ఎంపి లగడపాటి రాజగోపాల్ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ సాధిస్తున్న సామాజిక తెలంగాణను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు.

>
మరిన్ని వార్తలు