65 పేజీలు, 13 షెడ్యూళ్లతో తెలంగాణ బిల్లు

16 Dec, 2013 11:25 IST|Sakshi

హైదరాబాద్ : శాసనసభలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను 65 పేజీలు, షెడ్యూళ్లతో రూపొందించారు.

1వ షెడ్యూల్లో రాజ్యసభ సభ్యుల వివరాలు
2వ షెడ్యూల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల వివరాలు
3వ షెడ్యూల్లో శాసనమండలి స్థానాల వివరాలు
5వ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలోని  దళిత వర్గాల వివరాలు
6వ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల సమాచారం
7వ షెడ్యూల్లో నిధుల వివరాలు
8వ షెడ్యూల్లో ఫించన్ల పంపిణీ వివరాలు
9వ షెడ్యూల్లో ప్రభుత్వ రంగసంస్థలు, కార్పొరేషన్ల వివరాలు
10వ షెడ్యూల్లో రాష్ట్రా స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు
11వ షెడ్యూల్లో నదీజలాల నిర్వహణ, బోర్డుల విధి విధానాలు
12వ  షెడ్యూల్లో సహజ వనరులు బొగ్గు, విద్యుత్ విధివిధానాలు
13వ షెడ్యూల్లో విద్య, మౌళిక వసతుల వివరాలు

బిల్లు ప్రతులను అసెంబ్లీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించినప్పటికీ వెబ్సైట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. అసలు అసెంబ్లీ వెబ్సైట్ తెరిచేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నా, అది మాత్రం అసలు తెరుచుకోలేదు. ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల బహుశా సర్వర్ సమస్య వచ్చి ఉండొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు