తిరుమలకు చేరుకున్న కేసీఆర్‌

27 May, 2019 01:36 IST|Sakshi
తిరుమలలో ప్రజలకు అభివాదం చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

కుటుంబ సమేతంగా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి

విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఘనస్వాగతం

ఘనంగా అతిథి మర్యాదలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  

తిరుమల: శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానా శ్రయంలో, తిరుమలలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆదివారం సాయంత్రం 4.10 గంట లకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్ర యానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలం, నారాయణస్వామి, నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, టీటీడీ జేఈవో లక్ష్మీకాంతం, తిరుపతి సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్, అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్, నగర పాలక కమిషనర్‌ విజయ్‌రామరాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్న వారికి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ ఘనస్వాగతం పలికారు. సోమవారం ఉదయం మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి సీఎం కేసీఆర్‌ శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

ఘనంగా ఆతిథ్యం
తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్‌ తిరుమలకు రెండవసారి వచ్చారు. ఆయనకు టీటీడీ ఘనంగా ఆతిథ్య మర్యాదలు చేసింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సీఎం కేసీఆర్‌కు శ్రీకృష్ణ అతిథి గృహాన్ని కేటాయించారు. ముఖ్యమంత్రి భద్రతాధికారి ఎం.కె. సింఘ్, సీఐఎస్‌ఎఫ్‌ అడిషన్‌ కమాండెంట్‌ శుక్లా, టీటీడీ సీవీఎస్‌వో గోపీనాధ్‌ జెట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి పాదాలు సందర్శించిన కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కేసీఆర్‌ సతీమణి శోభారాణి, కోడలు సైలిమారావు, మనవడు ఇమానుష్‌రావు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం శ్రీవారి పాదాలను, శిలాతోరణం సందర్శించారు.
 

మరిన్ని వార్తలు