5 బండిళ్లలో తెలంగాణ ముసాయిదా బిల్లు

12 Dec, 2013 18:37 IST|Sakshi
5 బండిళ్లలో తెలంగాణ ముసాయిదా బిల్లు

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో దీన్ని తీసుకొచ్చారు. మొత్తం 5 బండిళ్లలో ఉన్న ముసాయిదా బిల్లు ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతికి అందజేశారు. సచివాలయంలో మొహంతిని కలిసి సురేష్ కుమార్ దీన్ని అందజేశారు.

తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రధాన కార్యదర్శి- ముఖ్యమంత్రికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం బిల్లు ప్రక్రియ కొనసాగనుంది.  ప్రధాన కార్యదర్శి కి బిల్లు ముసాయిదా అందజేయడమే తన పని సురేష్ కుమార్ తెలిపారు. కాగా, బిల్లు రేపు శాసనసభ ముందుకు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ బిల్లుపై చర్చించి, అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు మీద ఇప్పటికే సీమాంద్ర ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఓ తీర్మానం చేయాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరింది.

మరిన్ని వార్తలు