త్యాగాల ఫలితమే తెలంగాణ

22 Sep, 2013 02:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు, త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి అధ్యక్షతన సంగారెడ్డిలో జరిగిన ‘సోనియా అభినందన’ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లుగా, వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులను సన్మానించారు. ఎన్నికల ప్రణాళిక అ మల్లో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మస్థైర్యం, దార్శనికత ఉన్న నాయకురాలిగా సోని యాను అభివర్ణించారు. సమైక్య రాష్ట్రంలో 46 ఏళ్లపాటు ముఖ్యమంత్రులుగా కొనసాగిన ప్రాంతం వారే నష్టపోయామని అనడాన్ని డిప్యూటీ సీఎం ఆక్షేపిం చారు. ఆత్మగౌరవం, అస్తిత్వం, స్వయం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయినా ఒక్కటిగా కలిసుందామని ఆయన సూచించారు.
 
 హామీని నిలబెట్టుకున్న ఘనత సోనియాదే..
 గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జరుగుతున్నా సోనియా సూచన మేరకే తాము వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నామని మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్ని శక్తులు అడ్డుకున్నా సోనియా శక్తి ముందు ఎవరూ నిలవరన్నారు.రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగుతుందనే అపోహలు వద్దని రాజ్యసభ ఎంపీ నంది ఎల్లయ్య అన్నారు. కోర్ కమిటీ ఎదుట తెలంగాణపై డిప్యూటీ సీఎం సమర్థవంతంగా వాదనలు వినిపించారని ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వాలని మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండేలా పనిచేద్దామని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. ‘వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలని’ కోరుతూ డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించారు.
 
 సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్లకు సన్మానం
 ఇటీవలి ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, సహకార సంఘాల సొసైటీ చైర్మన్లుగా ఎన్నికైన వారిని డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సన్మానించారు. చెక్ పవర్ ఇవ్వాలని సమావేశంలో ప్రసంగించిన సర్పంచ్‌లు కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేల నిధులపై ఆశతో కొందరు ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరేందుకు వస్తున్నారని, అలాంటి వారిని చే ర్చుకోవద్దంటూ సర్పంచ్‌లు డిమాండ్ చేశారు.
 కార్యక్రమంలో పీసీసీ ఇన్‌చార్జి నర్సిం హారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుం కుమార్, డీసీసీబీ ైవె స్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, ఆర్‌సీపురం కార్పొరేటర్ పుష్ప, పార్టీ నాయకులు జె.శ్రీనివాస్‌రావు, శ్యాం మోహన్,  రఘునందన్‌రావు, కసిని విజయ్‌కుమార్, రామకృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు నగేశ్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సాబేర్, జగన్‌మోహన్‌రెడ్డి, మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, డోకూరు రామ్మోహన్‌రెడ్డి, బాలయ్య, ముక్తార్, అవినాశ్, ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 ‘ఇందిర భవన్’కు శంకుస్థాపన
 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్:జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ‘ఇందిర భవన్’కు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ శనివారం శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో రూ.1.35 కోట్లతో పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు వి.భూపాల్‌రెడ్డి వెల్లడించారు. డీసీసీ, అనుబంధ సంఘాల కార్యవర్గాలకు వసతి కల్పించే రీతిలో భవన నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి నిర్మాణం పూర్తి చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సునీ తా లక్ష్మారెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి, సీహెచ్ ముత్యంరెడ్డి, నందీశ్వర్‌గౌడ్, టి.నర్సారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జెట్టి కుసుం కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సాబేర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ‘సోనియా అభినందన సభ’లో భవన నిర్మాణానికి చొరవ చూపి న భూపాల్‌రెడ్డిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా పార్టీ నేతలు అభినందించారు.

Election 2024

మరిన్ని వార్తలు