కనక దుర్గమ్మకి బంగారు బోనం

5 Jul, 2020 16:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈఓ సురేష్‌ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (కరువు సీమలో సిరులు)

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరొనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదే విదంగా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు తలిపారు. సాయంత్రం 7 గంటల వరకు శాకాంబరిదేవీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను అనుసరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు