రచ్చబండలో రగడ

26 Nov, 2013 06:59 IST|Sakshi

వీపనగండ్ల, న్యూస్‌లైన్:  రచ్చబండలో రగడ రాజుకుంది. కార్యక్రమం బ్యానర్‌పై సీఎం ఫొటో తొలగింపుపై వివాదం నెలకొంది. కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డిల ఆధిపత్యపోరు అధికారులకు తలనొప్పుల ను తెచ్చిపెట్టింది.  పరిస్థితి చేయిదాటి ఓ అధికారిపై చేయిచేసుకు నే స్థాయికి వెళ్లింది. సోమవారం వీపనగండ్ల మండలకేంద్రంలో మండల ప్రత్యేకాధికారి గోపాల్ అధ్యక్షతన రచ్చబండ కార్యక్ర మం ప్రారంభమైంది.

ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యుడు జూ పల్లి కృష్ణారావును వేదికపైకి ఆహ్వానించిన అనంతరం ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను ఆహ్వానించారు. రచ్చబండ కమిటీ సభ్యులను వేదికపైకి పిలవకపోవడంతో పాటు రచ్చబండ బ్యానర్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో లేకపోవడం పట్ల మామిళ్లపల్లి వర్గీయులు గందరగోళం సృష్టించారు. ఎవరూ పిలవకుండానే మామిళ్లపల్లి వేదికపైకి ఎక్కారు. ఏ హోదాలో విష్ణువర్ధన్‌రెడ్డిని వేదికపైకి ఆహ్వానించారని అక్కడే ఉన్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అధికారులను నిలదీశారు.  ప్రొటోకాల్ ప్రకా రం రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉండాలని, ఎందుకు ప్రొటోకాల్ పాటించలేదని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం ఫొ టోకు లేని ప్రొటోకాల్ వేదికపైకి వచ్చిన తనను ఉందా? అని వాగ్వాదానికి దిగారు. మొదటి పేజీ తరువాయి
 ఇంతలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి పూనుకున్నారు. మామిళ్లపల్లి స్టేజీ దిగాలని లేకపోతే ర చ్చబండను రద్దుచేయాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు పట్టుబట్టారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. అధికారులను ఎమ్మెల్యే ఎంపీడీఓ చాంబర్‌లోకి పిలిపించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బయటికి వచ్చి పంపిణీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకాధికారిపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు రచ్చబండ నిర్వహించకుండా ముగించాలని జూపల్లి ప్రత్యేకాధికారిని ఆదేశించడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
కొద్దిసేపటికి కార్యాలయ ఆవరణలో మామిళ్లపల్లి దగ్గర ప్రత్యేకాధికారి కూర్చొవడాన్ని గమనించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తదనంతరం ప్రత్యేకకౌంటర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం ఎంపీడీఓ గదిలో మండల ప్రత్యేకాధికారి గోపాల్‌ను నిర్బంధించారు. ఇరువర్గాల పెనుగులాటలో ఆయన చొక్కా చిరిగింది. పోలీసుల రక్షణతో జూపల్లి ప్రత్యేకాధికారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రచ్చబండ నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టారు.
 ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై కుట్రతోనే..
 ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రక్షణ లేకపోవడంతో పాటు నిత్యం ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తనపై  జరిగిందని మండల ప్రత్యేకాధికారి గోపాల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో పేర్కొన్నారు. జూపల్లి చేయి చేసుకున్నాడన్న ప్రచారం జరగడంతో  ఈ విషయాన్ని ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లగా జూపల్లి తనపై చేయి చేసుకోలేదని తనను రక్షించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఎవరో కార్యకర్తలు తనపై దాడిచేసి అవమానపరిచారని వాపోయారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య, తహశీల్దార్ శాంతకుమారి, ఏఓ పూర్ణచంద్రారెడ్డి, ఏఈలు రవికృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, గఫార్, ఏపీఎం పార్వతి, ఏపీఓ శేఖర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు