బిల్లును గట్టెక్కించేందుకు టీ.నేతల వ్యూహం

3 Jan, 2014 16:29 IST|Sakshi

హైదరాబాద్:  తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. మినిస్టర్ క్వార్టర్స్‌ క్లబ్‌ హౌస్‌లో శుక్రవారం తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశమైయ్యారు. తెలంగాణ బిల్లులో తెలంగాణపై విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైయ్యారు.

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని చెప్పారు. అంతేకాక ఇప్పటికీ విభజనకు టీడీపీ కట్టుబడే ఉందని అన్నారు. తమపార్టీ నేతల్ని విమర్శించకుండా కలుపుకుని పోవాలని ఎర్రబెల్లి చెప్పారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ బిల్లును గట్టెక్కించేంతవరకూ ఐక్యంగా ఉందామని చెప్పారు. అయితే అసెంబ్లీలో తెలంగాణ బిల్లును గట్టెక్కించేందుకు ఫ్లోర్ కో ఆర్డినేషన్ అవసరమని నేతలందరూ ఈ భేటీలో భావించినట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రి శ్రీధర్బాబుకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు