ఈనాటి ముఖ్యాంశాలు

21 Jun, 2019 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మహోజ్వల జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. రాజ్యసభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు