ఈనాటి ముఖ్యాంశాలు

23 Jun, 2019 20:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకంపై వస్తున్న అపోహలకు ప్రభుత్వం తెరదించింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని ప్రకటించింది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం ఫిరాయింపు కిందకే వస్తుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. ప్రజావేదిక విషయంలో టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలను వైఎస్సార్‌సీసీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ప్రజా వేదిక  ప్రభుత్వ నిధులతో నిర్మించారని.. కానీ చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో జరిగిన దోపిడీలన్నీ బయటకొస్తాయని.. ఎవరూ తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని బాలాజీనగర్‌ చెందిన 7 ఏళ్ల చిన్నారిపై ఓ వృద్ధ మానవ మృగం అత్యాచారానికి యత్నించాడు. ఇండియానాలోని భారతీయ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

>
మరిన్ని వార్తలు