కిర్గిస్తాన్‌లో తెలుగు విద్యార్థుల యాతన

7 Jun, 2020 05:20 IST|Sakshi
కిర్గిస్తాన్‌లోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థినులు

ఇండియన్‌ ఎంబసీ వద్ద ఆందోళన

గుత్తి: తమను స్వస్థలాలకు పంపాలంటూ కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆ దేశంలోని ఇండియన్‌ ఎంబసీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కిర్గిస్తాన్‌లోని మెడికల్‌ కాలేజీల్లో వందల మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడి కాలేజీలతో పాటు హాస్టళ్లనూ మూసేశారు. ఈ నేపథ్యంలోనే తమను స్వస్థలాలకు పంపాలంటూ 20 రోజులుగా వారు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శనివారం భారత ఎంబసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంబసీ అధికారులు తామేమీ చేయలేమని, మీ రాష్ట్రాల ప్రభుత్వాలకు చెప్పుకోవాలంటూ తేల్చి చెప్పడంతో విద్యార్థులు వెనుదిరిగారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన 45 మంది ఉన్నారు. తిండి, నిద్ర లేక నానాయాతన పడుతున్నామని తమకు న్యాయం చేసేలా, ప్రభుత్వాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు హర్షవర్దన్‌రెడ్డి, రవితేజారెడ్డి, సాయిచరణ్, సాయివెంకటకృష్ణ, మేఘన, ప్రియాంకలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మరికొందరు విద్యార్థులు వాట్సాప్‌ ద్వారా ‘సాక్షి’ విలేకరికి విన్నవించారు.

మరిన్ని వార్తలు