భానుడు భగభగ

19 Jun, 2018 08:53 IST|Sakshi

పెరిగిన ఉష్ణోగ్రతలు

పగటి వేళ సెగలు సాయంత్రానికీ తగ్గని వేడి

ప్రభావం చూపని రుతుపవనాలు

మరో నాలుగు రోజులింతే..

ఈనెల మొదటి వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా మళ్లీ భానుడు  ప్రతాపం చూపుతున్నాడు.నైరుతి రుతు పవనాలు తొందరగా వచ్చినా ఫలితం కనిపించలేదు.గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం
జూన్‌ ఆరంభం వేడి ప్రభావంతక్కువగానే ఉంది. అంతేకాకుండాకొద్దో గొప్పో చినుకులూ పడ్డాయి.దీంతో రైతులు ఖరీఫ్‌ పనులనుప్రారంభించారు. ఉన్నట్లుండి నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. మేనెల మాదిరిగావడగాల్పులు కూడా వీస్తున్నాయి.

తిరుపతి తుడా:  ఎండలు భగ భగ మండుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా భానుడు చెలరేగుతున్నాడు. జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఎండ తీవ్రత మే నెలను తలపిస్తోంది.  ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సోమవారం రాయల సీమ జిల్లాలతో పోలిస్తే తిరుçపతిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వారం క్రితం వరకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు నాలుగు రోజులుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఐదారు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలంతా వేడి సెగలుగా ఉంది. తక్కువ రోజుల వ్యవధిలో ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు  తట్టుకోలేకపోతున్నారు.

నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని  వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంపై రుతుపవనాలు బలంగా లేనందున ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ నిపుణులు  చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అంచనా. మరోపక్క ఈశాన్య గాలులు ప్రభావం అధి కంగా ఉండటం, రుతుపవనాలకు అల్పపీడనం తోడవ్వకపోవడంతో  ఆశించిన స్థాయిలో తొలకరి జల్లులు లేవు. రుతుపవనాలు వచ్చినా అల్పపీడనం బలంగా తోడైతేనే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేవరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందంటున్నారు. ఇందుకు మరో మూడు, నాలుగు రోజులు పట్టవచ్చు. అంత వరకు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశముంది.

ఎండకు ఉక్కిరి బిక్కిరి..
ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరంగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జూన్‌ మూడో వారంలోనూ 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి సెలవులు పూర్తి చేసుకుకోవడంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5.50 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్ధులు బడులకు వచ్చి వెళ్లే సమయంలో మాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభా వంతో జూన్‌ మొదటి నుంచి ఉష్ణోగ్రతలు జిల్లావ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొం దారు. ఈ ప్రభావం ఎక్కువ రోజులు కనిపిం చలేదు. గడిచిన నాలుగు రోజులుగా 39 డిగ్రీలకు మించి నమోదువుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశం ఉండటంతో ఎండల్లోనే కార్యకలాపాలు సాగిం చాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు