సిటీ సివిల్‌ కోర్టులో తాత్కాలిక హైకోర్టు

13 Feb, 2018 02:46 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన

సాక్షి, అమరావతి: రాజధానిలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అమరావతిలో సిటీ సివిల్‌ కోర్టు నిర్మించి అందులోనే తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తాత్కాలిక హైకోర్టును నాలుగు ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మించే ఆలోచనను విరమించుకుంది. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వ్యయంతో తాత్కాలిక హైకోర్టు నిర్మాణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ యోచనను విరమించుకున్నారు. 

15న ఢిల్లీకి చంద్రబాబు :ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్‌ అనంతరం బీజేపీ–టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తదితరులతో చంద్రబాబు చర్చలు జరుపుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు