'వచ్చే ఏడాదికి ఇసుక ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం'

23 Aug, 2014 12:17 IST|Sakshi
'వచ్చే ఏడాదికి ఇసుక ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం'

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం పది ఇసుక రీచ్లకు మాత్రమే అనుమతులున్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభిస్తామని చెప్పారు. 83 ఇసుక రీచ్లకు అనుమతుల కోసం కేంద్రాన్ని కోరనున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ద్వారా వచ్చే ఏడాది నాటికి రూ. వెయ్యి కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పీతల సుజాత వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇసుక రీచ్లపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పీతల సుజాతపై విధంగా సమాధానం ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు