తెనాలి ఆర్డీవో ఆదర్శం

18 Jun, 2019 10:17 IST|Sakshi
చెరుకూరి సిద్ధార్థతో ప్రధానోపాధ్యాయుడు వెలగా శరత్‌బాబు

తన కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన రంగయ్య

సాక్షి, తెనాలి: విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నలుగురికీ చెప్పడానికే పరిమితం కాకుండా తన కుమారుడిని సర్కారీ బడిలో చేర్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు తెనాలి ఆర్డీవో చెరుకూరి రంగయ్య. పాఠశాలలు పునఃప్రారంభమైన తరుణంలో రంగయ్య తన కుమారుడు సిద్ధార్థను స్థానిక కొత్తపేటలోని రావి రంగయ్య మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో చేర్చారు. గత ఏడాది వరకు సిద్ధార్థ కార్పొరేట్‌ పాఠశాలలో చదివాడు.

కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిండానికి కారణమేమిటనే విషయమై ఆర్డీవోను ఫోన్‌లో సంప్రదించగా.. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలనే ఉద్దేశంతో చేర్చానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా బోధన బాగుంటుందని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు వెలగా శరత్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, వసతులు బాగున్నాయన్నారు. ఈ విషయాన్ని అందరూ ఇప్పటికే గుర్తించారన్నారు. (చదవండి: ఒక టీచర్‌.. ఒక కలెక్టర్‌.. ఒక మంచి పని..)

మరిన్ని వార్తలు