కరోనా: మిషన్‌.. మే 15

5 May, 2020 08:22 IST|Sakshi
మాట్లాడుతున్న కోవిడ్‌–19 ప్రత్యేక అధికారి దినేష్‌కుమార్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు 

నరసరావుపేటలో జీరో కేసులే లక్ష్యం

సాక్షి, నరసరావుపేట: నరసరావుపేటలో కోవిడ్‌–19 జీరో కేసులే లక్ష్యంగా ‘మిషన్‌ మే 15’ కోసం ప్రతి విభాగం పాటుపడుతుందని కోవిడ్‌–19 నియంత్రణ ప్రత్యేకాధికారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి మరో మూడు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. (ఉరి వేసుకుని ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య)

  • నరసరావుపేట కరోనా హాట్‌స్పాట్‌గా మరిందన్నారు. ఈ పరిస్థితుల్లో గత ఐదురోజులుగా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించి సోమవారం ఒక రోజు వెసులుబాటు కల్పించామన్నారు. 
  • ఈ క్రమంలోనే జీరో కేసులే లక్ష్యంగా మిషన్‌ మే 15 అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. 
  • మున్సిపాలీ్టలో ప్రభుత్వ ఆరోగ్య విభాగం ద్వారా అనుమానితులు అందరికీ కోవిడ్‌–19 పరీక్షలు చేస్తామన్నారు.  
  • ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఇళ్ల ముందు మూకుమ్మడిగా కూర్చోవటం, ఒకే చోట గుమికూడి ఆటలు ఆడటం సరికాదన్నారు. 
  • ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
  •  నిత్యావసరాలు, మందులు డోర్‌ డెలివరీ ద్వారా అందజేస్తామన్నారు.  
  • వైరస్‌ నియంత్రణలో భాగంగా ఒక్క నరసరావుపేటలోనే 3,500 పరీక్షలు చేయగా ఇది బిహార్‌ రాష్ట్రం మొత్తం చేసిన దానికంటే ఎక్కువ అన్నారు. 
  • రెడ్‌జోన్‌ వరవకట్టను జల్లెడ పట్టి 1,200 మందికి పరీక్షలు చేశామన్నారు.  
  • ప్రతి ఒక్కరూ మాస్‌్కలు ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఎం.వీరారెడ్డి, ట్రైనీ డీఎస్పీ మాధవరెడ్డి, ప్రజారోగ్యశాఖ ఈఈ ఎ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
     

జనతా బజార్‌ సందర్శన
ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినుకొండరోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ఉన్న జనతా బజార్‌ను సోమవారం ఉదయం నరసరావుపేట కోవిడ్‌–19 ప్రత్యేకాధికారి దినేష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. జనతా బజార్లలో ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే విక్రయాలు జరపాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు