పుదుచ్చేరి సీఎం సభలో ఉద్రిక్తత

29 Feb, 2016 01:34 IST|Sakshi

యానాం టౌన్ : యానాంలోని జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో ఆదివారం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి పాల్గొన్న సభలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత మిక్సీలు, గ్రైండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఆదివారం ఉదయం యానాం వచ్చారు. పంపిణీని ప్రారంభించేందుకు ఆయనతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే బాలన్, పీఆర్‌టీసీ ైచె ర్మన్ జ్ఞానశేఖరన్ వేదికపైకి వచ్చారు. వీరితో పాటు త్వరలో యానాంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యానాం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న విశ్రాంత ఎస్పీ తిరుకోటి భైరవస్వామి వే దికపైకి వెళ్లారు.
 
  ప్రభుత్వం నిర్వహించే సభలో ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం తగదని సీఎం వద్ద ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లాడి వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు నిలబడి ఆయనకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పలువురు వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకుంది. వారిని పోలీసులు అదుపు చేశారు. ఈ దశలో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం రంగసామి మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత భైరవస్వామి మద్దతుదారులు ఆయనను వేదిక కిందకు తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం సభ కొనసాగింది.
 
 ఇటువ ంటివి సాధారణం : ఈ వివాదంపై సీఎం రంగసామి స్పందిస్తూ..  ఇటువంటి ఘటనలు సాధారణమని విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు, అభ్యర్థుల విషయమై ఎన్నికల నోటిఫికేషన్ వ చ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు