సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత

11 Feb, 2017 10:58 IST|Sakshi

తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు