రాయన్నపాలెంలో ఉద్రిక్తత

26 Dec, 2018 18:17 IST|Sakshi

పెదవేగి: హైటన్షన్‌ వైర్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దెందులూరు వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరీ కుటుంబంపై ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. ఖాళీ స్థలం ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ నేత కొఠారు రామచంద్రరావు ఇంటిపై నుంచి హైటెన్షన్‌ వైర్లు వేయాలంటూ విద్యుత్‌ అధికారులపై చింతమనేని ఒత్తిడి తేవడమే ఉద్రిక్తతకు కారణమైంది.

కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కొఠారు విజ్ఞప్తి చేసినా విద్యుత్‌ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేత కొఠారు రామచంద్రరావు, అధికారులను అడ్డుకుని అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ప్రభుత్వం సంఘటనాస్థలానికి భారీగా పోలీసులను  మోహరించింది. కొఠారు రామచంద్రరావుకు మద్ధతుగా రాయన్నపాలెంలోని ఆయన ఇంటి వద్దకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు.

>
మరిన్ని వార్తలు