టెన్షన్.. టెన్షన్

23 Jan, 2014 05:47 IST|Sakshi

 సత్తుపల్లి/సత్తుపలి ్లరూరల్, న్యూస్‌లైన్: ఓపెన్‌కాస్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న కొమ్మేపల్లి, కిష్టారం గ్రామాలకు చెందిన సింగరేణి భూ నిర్వాసితులు అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ఓసీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజాము నుం చే పోలీసులు ఓపెన్‌కాస్టు పరిసర ప్రాంతాలలో భారీగా మోహరించటంతో టెన్షన్ వాతావర ణం నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే అరెస్ట్‌ల పర్వం కొనసాగడంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రోడ్డుపైకి రాగానే అరెస్ట్ చేస్తుండడంతో పోలీసులతో పలువురు వాగ్వాదానికి దిగా రు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం 22 రోజు లుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఇప్పుడు ముట్టడి కార్యక్ర మం చేపడితే వారికి తొత్తులుగా మారిన పోలీసు లు తమను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు. పోలీసులకు, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో పోలీసులు జీపు కదల నీయకుండా ఆందోళనకారులు చుట్టుముట్టారు.  

 వ్యూహాత్మకంగా ముట్టడి..
 పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తుంటే.. ఆందోళన కారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కొమ్మేపల్లి, కిష్టారం నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో మహిళలు సింగరేణి వై జంక్షన్ కు చేరుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన పోలీ సులు భారీగా వైజంక్షన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు జంక్షన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

 కాగా, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వై జంక్షన్ వద్దకు ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.  ముట్టడిని భగ్నం చేసేందుకు సత్తుపల్లి డీఎస్పీ బి.అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అశ్వారావుపేట, సత్తుపల్లి టౌన్, రూరల్ సీఐలు, పలువురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఓసీ వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు.  

 నిలిచిన బొగ్గు రవాణా..
 ఓపెన్‌కాస్టు ముట్టడితో బొగ్గు రవాణాకు ఆటం కం ఏర్పడింది. ఉదయం నుంచే లోడింగ్‌ను నిలిపివేశారు. సుమారు 5వేల టన్నుల బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి పీఓ ఎస్.సూర్యనారాయణ తెలిపారు. అయితే ఉత్పత్తికి మా త్రం ఎలాంటి అంతరాయం ఏర్పడలేదన్నారు.
 అర్ధరాత్రి అరెస్ట్‌లు..
 అశ్వారావుపేట/ దమ్మపేట, న్యూస్‌లైన్: వారు ప్రజల సొమ్మును లూటీ చేయలేదు.. పేదల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేవారూ కాదు.. నిర్వాసితుల కోసం ప్రభుత్వంతో శాంతి యుత పోరాటం చేస్తున్న రాజకీయ నాయకులు.. అలాంటి వారిని తీవ్రవాదులను నిర్బంధించినట్లుగా సత్తుపల్లి పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి దమ్మపేట స్టేషన్‌కు తరలించారు. ఇదేమంటే అవాంఛనీయ ఘటన లు జరగకుండా స్టేషన్ మార్చామంటూ సమర్థించుకుంటున్నారు.
 సత్తుపల్లి జేవీఆర్ ఓసీ విస్తరణలో భాగంగా కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాధపురం గ్రామాల రైతుల భూములు, గ్రామాలను సింగరేణి యాజమాన్యం స్వాధీనపరుచుకోనుంది. రైతులు కూడా భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొత్త భూసేకరణ చట్టం ప్రకా రం నష్టపరిహారం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓసీని ముట్టడికి నిర్ణయించారు. వారికి అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి.
 సొంతపూచీకత్తుపై విడుదల..
 నిర్వాసితులకు మద్దతుగా పోరాడుతున్న వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కోటగిరి మురళీకృష్ణారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, సీపీఐ డివిజన్, మండల కార్యదర్శులు దండు ఆదినారాయణ, తడికమళ్ల యోబు, న్యూడెమోక్రసీ నేత ఎ.రాములును  మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తామేం చేశామని   ప్రశ్నిస్తే ‘మా సార్ చెప్పారు.. మిమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నాం..’ అనే సమాధానం మినహా పోలీసులు ఇంకేమీ చెప్పడం లేదు. చివరకు బుధవారం మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 పిరికిపంద చర్యే..:
 ఇది ముమ్మాటికీ పోలీసుల పిరికిపంద చర్యే.. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతిచ్చిన మమ్మల్ని అత్యంత దిగజారుడు తనంగా దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. మమ్మల్ని సత్తుపల్లిలో ఉంచే ధైర్యం పోలీసులకు ఎందుకు లేదో చెప్పాలి. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదు.
 -డాక్టర్ దయానంద్ విజయ్‌కుమార్, వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ  సమన్వయకర్త
 రజాకార్లలా వ్యవహరించారు..:
 పోలీసులు వ్యవహరించిన తీరు రజాకార్లను గుర్తుచేస్తోంది. రైతుల సమస్యలపై న్యాయబద్ధంగా పోరాడుతున్న మమ్మల్ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురావడం పద్ధతికాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా.. తుపాకీ పాలననా.. అర్థం కావడం లేదు.
 - ఉడతనేని అప్పారావు కాంగ్రెస్ నాయకులు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’

‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’

అవినీతి అంతా బయటకు తీస్తాం: చీఫ్‌ విప్‌

సెంట్రల్‌ జైలులో మృత్యుఘోష

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..

అది చిరుత కాదు హైనానే

ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి

సదా ప్రజల సేవకుడినే

నిబంధనలు తూచ్‌ అంటున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు: వైఎస్‌ జగన్‌

నారాయణ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

పన్నులు కట్టండి.. కర్తవ్యాన్ని పాటించండి

పులివెందులలో ప్రగతి పరుగు

సమగ్రాభివృద్ధే విజన్‌

వడ్డీ జలగలు..!

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

గుట్టుగా గుట్కా దందా

చరిత్ర సృష్టించిన ప్రకాశం పోలీస్‌

ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ 

సచివాలయం కొలువులకు 22న నోటిఫికేషన్‌

బల్లికి 3,000.. ఎలుకకు 10,000

అతివలకు అండగా..

బీసీల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

రాష్ట్రమంతటా వర్షాలు

24న నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా