పదో తరగతి పరీక్షలు ప్రారంభం

17 Mar, 2017 09:35 IST|Sakshi

హైదరాబాద్‌ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. మొత్తం 6,28,081 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 2,931 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారి సీసీఈ విధానం అమలు చేస్తున్నారు. పావు గంట అదనపు సమయం ఇచ్చారు. కాగా, ఈ సందర్భంగా 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నామని, ఆలస్యంగా వస్తే అనుమతించబోమని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 5,38,226 మంది విద్యార్థులకు 2,556 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఉదయం 9.30కి ప్రారంభం అయ్యే పరీక్షలకు విద్యార్థులను 8.45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి ఇచ్చారు. ఈ నెల 14 నుంచే టెన్త్‌ పరీక్షలు ప్రారంభమైనా 14, 15, 16న ఓరియంటల్‌ ఎస్సెస్సీ, వొకేషనల్‌ ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించారు.

కాగా పరీక్ష కేంద్రాల్లోకి వాటర్‌ బాయ్‌ని కూడా అనుమతించడానికి వీల్లేదని పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్‌ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో కరస్పాండెంట్లను కూడా రానీయొద్దని స్పష్టం చేశారు. పరీక్ష సిబ్బంది సహా ఎవరూ సెంటర్లలోకి మొబైల్స ఫోన్లు తీసుకెళ్ల రాదని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

మరిన్ని వార్తలు