మే మొదటి వారంలో ‘పది’ ఫలితాలు

13 Apr, 2017 01:08 IST|Sakshi

రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్‌ భార్గవ
చిత్తూరు ఎడ్యుకేషన్‌: ఈనెల 16వ తేదీతో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తవుతుందని, ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్‌ భార్గవ తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్‌లో జరుగుతున్న మూల్యాంకనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. కాపీకొట్టే పద్ధతిని అరికట్టి పకడ్బందీగా పదో తరగతి పరీక్షలను నిర్వహించే పద్ధతిని తీసుకొస్తామన్నారు. బట్టీ విధానాన్ని తొలగించేందుకు, విద్యార్థి తెలివితేటలను కనిపెట్టేలా సీసీఈ పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు.ఈ విధానంలో విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్‌లో ఎక్స్‌టర్నల్‌ మార్కులను కలిపే ప్రక్రియ జరుగుతోందన్నారు.
 

మరిన్ని వార్తలు