కన్న తండ్రి కన్నుమూసినా..

24 Mar, 2018 11:59 IST|Sakshi
పరీక్ష రాస్తున్న సుమతి

పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరైన విద్యార్థిని

తొండంగి: కన్నతండ్రి మృతి చెందినా బరువెక్కిన హృదయంతో పదోతరగతి పరీక్షకు హాజరైంది తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన మాధన సుమతి. ఈమె ఇదే గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతోంది. శుక్రవారం తెల్లవారుజామున తండ్రి మాధన వీరభద్రరావు అనారోగ్యంతో మృతిచెందారు. కన్నతండ్రి మృతి చెందినా, అంత్యక్రియలు పూర్తికాకుండా శుక్రవారం తొండంగి అక్షర పబ్లిక్‌ స్కూల్‌ సెంటర్‌లో పరీక్షా కేంద్రానికి వెళ్లి ఫిజిక్స్‌ పరీక్ష రాసింది. కాగా సుమతి అక్క సుధారాణి  గతంలో హైస్కూల్లో పదవతరగతి పరీక్షల్లో ప్రథమస్థానంలో నిలిచింది. కాగా ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ చదువుతుండగా పెళ్లి సంబంధం కుదరడంతో చదువుకు బ్రేక్‌పడింది. కొద్ది రోజుల్లో వివాహ ముహూర్తాలు పెట్టుకుందామన్న నేపథ్యంలో సుమతి, సుధారాణిల కుటుంబసభ్యులకు తండ్రి మరణం తీరని విచారాన్ని మిగిల్చింది.

మరిన్ని వార్తలు