పుట్టెడు దుఃఖం దిగమింగి.. పరీక్షకు హాజరు

21 Mar, 2018 12:13 IST|Sakshi
పదో తరగతి పరీక్ష రాస్తున్న మణెమ్మ

తండ్రి మరణించిన బాధలోనూ...

ఓబులవారిపల్లె :  తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. చిన్నఓరంపాడు కస్తూరిబాగాంధీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మణెమ్మ తం డ్రి పులి మునెయ్య (55) గుండెపోటుతో సోమవా రం మృతిచెందాడు. పుల్లంపేట మండలం అనాసముద్రం దళితవాడ గ్రామానికి చెందిన మునెయ్య వ్యవసాయ కూలీ. ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. రెండో సంతానం మణెమ్మను కస్తూరిబాగాంధీ పాఠశాలలో చేర్పించారు. మునెయ్య గుండెపోటుతో మృతి చెందాడనే విషయాన్ని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి మంగళవారం ఉదయం వాహనంలో అనాసముద్రానికి తీసుకుని వెళ్లి తండ్రి మృతదేహాన్ని చూపించారు. తర్వాత స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తీసుకొచ్చి పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షకు హాజరు పరచారు. ఆ విద్యార్థినిని తోటి విద్యార్థినులు, ఉపాధ్యాయులు పరామర్శించారు.

మరిన్ని వార్తలు