9న ‘టెట్’ల

4 Feb, 2014 05:11 IST|Sakshi

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఈ నెల 9వ తేదీన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించనున్నట్లు ఏజేసీ పెంచలరెడ్డి తెలిపారు. స్థానిక గోల్డెన్‌జూబ్లీహాల్లో సోమవారం పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 11,626 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నెల్లూరు నగరంలో 51 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం ఆరు కేంద్రాలు, మధ్యాహ్నం 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.
 
  మొబైల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకుని రాకూడదన్నారు. వాటిని పరీక్ష కేంద్రాల్లోకి తెచ్చినవారిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రతి సెంటర్‌కు చీఫ్ సూపరింటెండెంట్లను నియమిస్తున్నామన్నారు. జిల్లా అధికారులను చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో మౌలికసదుపాయాలు ఏర్పాటుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 
 8న నవోదయ ప్రవేశ పరీక్షలు

 జవహర్ నవోదయ  విద్యాలయ-2014 ప్రవేశ పరీక్షలను ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏజేసీ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలో 15 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 4500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఈఓ రామలింగం, రాష్ట్ర పరిశీలకులు ప్రొఫెసర్ రాఘవరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు