పుస్తకం లేని చదువులు

24 Oct, 2017 16:07 IST|Sakshi

ఇలాగైతే.. డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యేదెట్ట?

ఇంటర్‌ విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు

వచ్చే ఏడాది సిలబస్‌ మార్పు పేరుతో ముద్రణ నిలిపివేత

ప్రయివేటు పబ్లిషర్స్, పాత బుక్కులే దిక్కు

ఆందోళనలో విద్యార్థులు 

కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో

అధ్యాపకులు కూడా తాము బోధించిన అంశాలకు నోట్స్‌ ఇవ్వకపోవడంతో స్లిప్‌ టెస్ట్‌లు రాసేందుకు సైతం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు పబ్లిషర్స్‌ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న వారు వాటిని కొనుగోలు చేయలేక పరీక్షలకు సరిగా ప్రిపేర్‌ కాలేకపోతున్నారు. దీంతో తక్కువ మార్కులు రావడం, ఫెయిల్‌ అవుతుండడంతో కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని కళాశాలల్లో మాత్రమే సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్‌ పూర్తి చేసిన వారి నుంచి తిరిగి ఇప్పించుకుని అందజేశారు. మొదటి ఏడాది విద్యార్థులకు గత ఏడాది మిగిలిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ రూపంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రం పుస్తకాలు అందాయి.  

ప్రతిపాదనలు కోరని ప్రభుత్వం  
జిల్లావ్యాప్తంగా 42 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 10 వేల మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేళ్లుగా ప్రభుత్వం సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. ఈ కారణంతోనే ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు వెనుకబడుతున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలవుతున్నా నేటికీ ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కోసం విద్యాశాఖ ఇండెంట్‌ కోరలేదు. ఆర్ట్స్‌ విద్యార్థులు ఇతర పుస్తకాలను చదువుతూ కొంత మేరకు గడుపుతున్నా సైన్సు గ్రూప్‌ల వారు మాత్రం ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడుతుండడం, ఇంత వరకు పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై తీవ్ర ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  

పాఠ్య పుస్తకాల ముద్రణ నిలిపివేత!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ మీడియట్‌ సిలబస్‌లో సమూలమైన మార్పులు చేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగానే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం పుస్తకాల ముద్రణకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంతో కొన్ని పబ్లిషర్స్‌ అడ్డగోలుగా పాఠ్యపుస్తకాల ధరలు పెంచి విద్యార్థులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.  

పాత పుస్తకాలతో సర్దుబాటు చేశాం
ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. గతేడాది మిగిలిన పుస్తకాలతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి సేకరించి మొదటి సంవత్సరం విద్యార్థులకు కొంత మేరకు సర్దుబాటు చేశాం.  వచ్చే ఏడాది నుంచి సిలబస్‌ మార్పులు జరుగుతుండడంతోనే పాఠ్య పుస్తకాలను ఇవ్వలేదు.  
                       – సుబ్రమణ్యేశ్వరరావు, డీవీఈఓ   

మరిన్ని వార్తలు