పొందూరులో టెక్స్‌టైల్ పార్కు

28 Dec, 2014 00:55 IST|Sakshi
పొందూరులో టెక్స్‌టైల్ పార్కు

 పొందూరు :  పొందూరులో కనీసం వెయి మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. స్థానిక సాయిబాబా చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత వృత్తిలో ఆదాయం లేక, ఎంతోమంది కార్మికులు హైదరాబాద్‌లో మట్టితవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తులు కనుమరుగవ్వకుండా ఉండాలంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్ప ల్ మాట్లాడుతూ  చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే మార్కెటింగ్ జరగాలన్నారు. చేనేత వస్త్రాలను ధరిస్తే దాదాపు ఎలర్జీలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో విదేశీయులు వీటిపై మక్కువ చూపుతుంటారని తెలిపారు. విదేశాలకు ఉత్పత్తులను పంపిస్తే డిమాండ్ పెరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా లాభాలు వస్తాయని పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు మండల రెవెన్యూ కార్యాలయం పరంగా అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
 
 స్కాలర్‌షిప్‌ల పంపిణీ
 మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకం కింద తొమ్మిది, పది, ఇంటర్ చదువుతున్న 88 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి  రూ. 1200లు చొప్పున స్కాలర్‌షిప్‌లను, చేనే త కార్మికులకు డిజైనింగ్ పరికరాలను కలెక్టర్, విప్, ఎల్‌ఐసీ డివిజనల్ మేనేజర్ కె.రవికాంత్ అందజేశారు. జిల్లాలో మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకం ద్వారా 1053 మం దికి స్కాలర్ అందిస్తున్నామని హ్యాండ్‌లూమ్ ఏడీ గుత్తు రాజారావు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాముల నాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు అనకాపల్లి అనూష, తహశీల్దార్ భువన్ మోహన్, ఎంపీడీవో బాలసుబ్రహ్మణ్యం, పొందూరు, తోలాపి చేనేత సహకార సంఘాల అధ్యక్షులు గంపల వీరభద్రస్వామి, బట్ట అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు