గత ఏడాది కంటే తగ్గిన ఉష్ణోగ్రత

4 Dec, 2014 00:43 IST|Sakshi
గత ఏడాది కంటే తగ్గిన ఉష్ణోగ్రత

చింతపల్లి: ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందుతున్న లంబసింగిలో  కొద్ది రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఎక్కువసార్లు స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది నవంబరు 27న చింతపల్లిలో 9, లంబసింగిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఈ ఏడాది అక్టోబరు 29 నుంచే చలి ప్రారంభమైంది. చింతపల్లిలో అక్టోబరు 29న 16, 31న 15 డిగ్రీలు, నవంబరు 27,28 తేదీల్లో 9 డిగ్రీలు, 29న 10 డిగ్రీలు, 30న, డిసెంబరు 1  8 డిగ్రీలు నమోదు కాగా, లంబసింగిలో 5 డిగ్రీలు నమోదైంది. మంగళవారం చింతపల్లిలో 7 డిగ్రీలు, లంబసింగిలో4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా బుధవారం నాటికి మాత్రం ఒక్కో డిగ్రీ పెరిగింది. గత ఏడాది డిసెంబరు 16,17 తేదిల్లో చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాదికి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలే అతిస్వల్పం కాగా ఈ ఏడాది నవంబరు నెలాఖరు నుంచే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు.

 గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా చలి తక్కువగా ఉండేదని, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు