నాగమణిది హత్యే

14 Feb, 2014 04:08 IST|Sakshi
నాగమణిది హత్యే

నాగమణిది హత్యే
 కలిదిండి:
 మండలంలోని సానారుద్రవరం గ్రామానికి చెందిన నాగమణిది హత్యేన ని దర్యాప్తులో తేలిందని డీఎస్పీ జి.నాగన్న తెలిపారు. కలిదిండి పోలీస్‌స్టేషన్ లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆ యన తెలిపిన సమాచారం ప్రకారం.. సానారుద్రవరానికి చెందిన మారుబోయిన రామ్మోహనరావుతో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నాగమణి (34)కి పదేళ్ల కిందట వివాహమైంది. నాగమణి కనిపించడంలేదని తల్లి కేసిరెడ్డి పెద్దలక్ష్మి ఈనెల మూడో తేదీన ఫిర్యాదు చేయగా, కలిదిండి పోలీసులు కేసు నమోదు చేశారు.
 
  ఈ నేపథ్యంలో మద్వానిగూడెం - ఏలూరుపాడు వంతెన స మీపంలో ఉప్పుటేరు గట్టు ముళ్లపొదల్లో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నాగమణి బంధువులను అక్కడకు తీసుకువెళ్లారు. వా రు మృతదేహాన్ని చూసి నాగమణిదేనని నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న స్థానికుడు నాంచార్య అనే వ్యక్తి సానారుద్రవరం వీఆర్వో పోతురాజు ద్వారా పోలీసులకు లొంగిపోయా డు. అతడు ఇంటింటికీ తిరుగుతూ పాలు, పచారీ సరుకులు అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో నాంచార్యకు నాగమణి సొమ్ము బాకీ పడింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగమణి ఇంట్లో ఓ వేడుక కోసం రూ.10 వేలు కావాలని సం క్రాంతి నుంచి నాంచార్యను అడుగుతూ వచ్చింది. ఈ నెల మూడో తేదీన మద్వానిగూడెం వంతెన వద్ద ఇద్ద రూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా డబ్బు విషయ మై వారి మధ్య ఘర్షణ జరిగింది. అతడు సహనం కోల్పోయి ఆమె చీర చెంగును మెడకు చుట్టి బిగించటంతో చనిపోయింది. ఆమె వద్ద ఉన్న రోల్డ్‌గోల్డ్ మం గళ సూత్రాలు, చైను, పట్టీలు, పర్సులోని రూ.310 నగదు, బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఇంటి వద్ద దా చాడు. విచారణలో నాంచార్య నేరం అంగీకరించడం తో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కైకలూరు సీఐ వెంకటేశ్వరరావు, కలిదిండి ఎస్సై యే సేబు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు