'పట్టిసీమ' పుట్టి ముంచేనా..?

7 Mar, 2015 04:53 IST|Sakshi

హైదరాబాద్: గోదావరి జలాల విషయంలోనూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కొత్త వివాదం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సర్కారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ వద్ద గోదావరినదిపై 80 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకం మరో జలజగడానికి దారితీసేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని మళ్లించడానికి పట్టిసీమ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పనుల కోసం టెం డర్లు పిలవడంతోపాటు ఓ కంపెనీకి కాంట్రాక్టును అప్పగించింది. 

పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి 4-5 ఏళ్లు పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు లిఫ్ట్ ద్వారా నీటిని మళ్లిం చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నీటిని పోలవరం కేటాయింపుల నుంచే పట్టిసీమకు వాడతారా? లేక పోలవరం పూర్తయ్యాక వరద జలాలను తీసుకునే ఉద్దేశం ఉందా? అన్నదానిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గోదావరి బోర్డు అనుమతి లేకుం డా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోం ది.  ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే పోల వరం అథారిటీ తొలి భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి    పట్టిసీమపై స్పష్టత కోరే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు