సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు

31 Dec, 2013 05:56 IST|Sakshi

నిజామాబాద్ నాగారం,న్యూస్‌లైన్: సంక్రాంతి వస్తోంది... సెలవులు వస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏరూట్లో అధికంగా ప్రయాణికులు ప్రయణిస్తున్నారో.. ఆ రూట్లలో అదనంగా బస్సులను నడపడానికి చర్యలు చేపట్టింది. జిల్లానుంచి దూర ప్రాంతాలకు బస్సులను కేటాయిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు సంక్రాం తి సెలవులు రావడంతో వారి సౌకర్యార్థం బస్సులను అదనంగా ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది.
 
 జిల్లాకు అదనంగా 190 బస్సులు..


 సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఆదాయం వచ్చే జిల్లా రూట్లలో ఆర్టీసీ యాజమాన్యం అదనంగా 190 బ స్సులను కేటాయించింది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, గుంటూరు, ఆర్మూర్ తదితర ప్రాం తాలకు ఎక్కువ మొత్తంలో బస్సులను కేటాయించింది ఆర్టీసీ. అవసరమైతే మరిన్ని బస్సులను కూడా ప్రయాణికుల కోసం కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజ ర్ కృష్టకాంత్ తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని జనవరి 9 నుంచి 15వరకు  ప్రత్యేక బస్సులను నడుపుతామని న్యూస్‌లైన్‌కు ఆయన వివరించారు. ప్రస్తుతం తెల్లవారుజామున ఇంద్ర, గరుడ బస్సులు నడపడం లేదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఈ ట్రిప్పులను సైతం నడిపేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు.ప్రయాణికుల సంఖ్య ఆధారం గా అప్పటికప్పుడు తరలించేందుకు 10 బస్సులను సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్‌లో, నిజామాబాద్ బస్టాండ్‌లో రద్దీని పరిశీలించి నిర్ణయాలు తీసుకునేలా ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌ఎం చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు