వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి

9 Sep, 2014 03:53 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రకటన జారీచేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా కొనసాగుతున్నారు.

దీంతోపాటు ఇటీవల ప్రకటించిన రాజ కీయ వ్యవహారాల కమిటీలో సభ్యునిగా చోటు దక్కింది. మళ్లీ ప్రధాన కార్యదర్శిగా నియా మకం కావడంపై జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డి ఎమ్మెల్యే గా, మంత్రిగా కీలక పదవుల్లో కొనసాగారు.
 
 ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేశారు. అలాగే ప్రజలకోసం పోరాటాలు సాగించే నేతగా పెద్దిరెడ్డికి మంచిపేరు ఉంది. పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలక పదవిలో పెద్దిరెడ్డి నియామకం జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత దోహదపడుతుందని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. సీఎం సొంత జిల్లాలో టీడీపీతో పోలిస్తే వైఎస్సార్‌కాంగ్రెస్ బలంగా ఉందని, అత్యధిక స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నామని, ఈక్రమంలో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని విశ్వసిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు