పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన వ్యక్తి అరెస్ట్

19 Jan, 2016 23:49 IST|Sakshi
పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన వ్యక్తి అరెస్ట్

పాడేరు రూరల్  : ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే ముఖం చాటేసిన ఓ వ్యక్తిని పాడేరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సూర్యప్రకాష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాడేరు పట్టణానికి చెందిన రొబ్బి నరేష్, దామోదుల చిన్ని ప్రేమించుకుని ఐదు నెలల క్రితం పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల పాటు సక్రమంగా   వీరి కాపురం సాగింది.  అనంతరం గొడవల కారణంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

ఈ విషయమై అడిగేందుకు పది రోజుల క్రితం భర్త నరేష్ ఇంటికి బంధువులతో కలిసి చిన్ని వెళ్లింది. అక్కడకు వెళ్లాక నరేష్ కుటుంబ సభ్యులు తమని అసభ్య పదజాలంతో దుషించడమే కాక,  దాడికి పాల్పడ్డారని పాడేరు పోలీసులకు చిన్ని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నరేష్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మిగిలిన బందువులను కూడ విచారిస్తున్నామని ఎస్‌ఐ సూర్యప్రకాష్ విలేకరులకు తెలిపారు.    
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా