ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్

9 Dec, 2015 19:10 IST|Sakshi

కడప పట్టణంలోని మద్రాస్ రోడ్డులో ఇద్దరు పాత నేరస్థులను సీసీఎస్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా గూడురు పట్టణానికి చెందిన అమావాస్య రమేష్, నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన చుక్కాల విజయ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 260 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు